ఆర్మూర్‌లో వరుస దొంగతనాలకు పాల్పడ్డ నిందితుడి అరెస్ట్….

On: Thursday, January 8, 2026 4:48 PM

ఆర్మూర్ పట్టణంలోని పంత్ రోడ్డు, రామ్‌నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో పలు దొంగతనాలకు పాల్పడి పరారీలో ఉన్న దాసరి అనిల్ (తండ్రి: గంగాధర్, నివాసం: రామ్‌నగర్, ఆర్మూర్)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈరోజు ఉదయం 9:30 గంటల సమయంలో దొంగతనం చేసిన బైక్‌పై ఆర్మూర్ బస్టాండ్ ముందు తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్, ఒక బంగారు గొలుసు, ఒక బంగారు ఉంగరం, 10 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో నిందితుడు దాసరి అనిల్ కదలికలను నిశితంగా గమనించి కేసులను ఛేదించిన కానిస్టేబుళ్లు కిరణ్ కుమార్, హరీష్‌లను ఆర్మూర్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు అభినందించారు.

05 Feb 2026

Leave a Comment