షాద్ నగర్ 10వ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకురాలు శ్రావణి.
షాద్ నగర్ పట్టణంలోని పదవ వార్డు పరిధిలో గల సీఎస్కే పారడైస్ కాలనీ మెయిన్ రోడ్డు సిసి రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. నాలుగు కోట్ల నిధులతో ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారని వార్డు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు శ్రావణి మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశాలతో వెంటనే పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె మీడియాకు తెలిపారు. సీఎస్కే అదేవిధంగా ఇతర కాలనీల విషయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎంతో చొరవ చూపుతూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను విను వెంటనే చేపట్టడం శుభసూచకమని ఆమె పేర్కొన్నారు. ఎంతోకాలంగా ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎట్టకేలకు ఎమ్మెల్యే శంకర్ చొరవతో మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు..