ఎల్లుండి నుంచి దరఖాస్తుల స్వీకరణ…..
హైదరాబాద్:ఏప్రిల్ 13:
తెలంగాణలో 2026 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ సోమవారం విడుదల అయింది, ఈ నెల ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించనున్నారు జూన్ 15 నుంచి 30 వరకు పరీ క్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది…
*పరీక్ష విధానం..
టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ 1 లో ప్రాథమిక పాఠశాల క్లాస్ (1-5 ) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది, పేపర్ 2 లో ఉన్నంత ప్రాథమిక పాఠశాల(6-8) ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుంది, అభ్యర్థులు ఒక పేపరు లేదంటే రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, టీజీ టెట్ పరీక్షల హాల్ టికెట్లను జూన్ మొదటి వారంలో హాల్ టికెట్లు విడుదల చేస్తారు.
జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించను న్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
ఒక ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 పరీక్షా ఫీజు స్వీకరించను న్నారు. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీ కల్పించనున్నారు. ఇక జూలైలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.








