తెలంగాణలో భగభగ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు…

On: Sunday, April 12, 2026 11:29 AM

 

Apr 12, 2026,

తెలంగాణ : రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. రెండు జిల్లాలను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. 20 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా గుళ్లకోటలో 41.7 డిగ్రీలు నమోదైంది. వచ్చే రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

12 Apr 2026

Leave a Comment