తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహణ….

On: Wednesday, September 10, 2025 2:37 PM

 

చేగుంట మండలం, కరీంనగర్ గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో ప్రఖ్యాతి పొందిన వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఊరడి మహిపాల్ యాదవ్, తాజా మాజీ ఉప సర్పంచ్ ఊరడి యాదగిరి గారు పాల్గొని, చాకలి ఐలమ్మ  గారి పోరాటాన్ని స్మరించుకున్నారు.

అలానే గ్రామ రజక సంఘం సభ్యులు శ్రీనివాస్, దేవరాజు, భూపాల్, భూమేష్, ప్రశాంత్ గారు మరియు గ్రామ యువజన నాయకులు నాగరాజు గౌడ్, భాను, ఎల్లం, స్వామి మహేష్, మలేషం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ గారి సాహసాన్ని, ఉద్యమానికి  ఇచ్చిన తోడ్పాటును గుర్తు చేస్తూ, ఆమె త్యాగాలకు నివాళులు అర్పించినందుకు గ్రామస్థులు ప్రగాఢమైన గౌరవాన్ని తెలిపారు.

04 Mar 2026

Leave a Comment