వన్నెల్(బి) పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు….

On: Tuesday, September 9, 2025 6:50 PM

 

ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా చిమ్మపూడి ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వన్నెల్(బి) ఉన్నత పాఠశాలలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ సాహితీ పోటీలను నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యార్థులు రితిక, లహరి, దీక్షిత్, ఈశ్వరి, హారిక, లక్ష్మీప్రణతి లకు బహుమతులను, ప్రశంసా పత్రాలను ప్రధానోపాధ్యాయులు జి.రాజేశ్వర్ రెడ్డి అందజేసినట్లు తెలుగు ఉపాధ్యాయుడు చాతెల్లి వివేకవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేందర్,అరుణ్,రాజగంగారం,భోజన్న,రాజేశ్వర్ , మధు,బాలస్వామి,సతీష్,మాలతి,ప్రవీణ్,శోభ ,సుజాత విద్యార్థులను అభినందించారు.

05 Feb 2026

Leave a Comment