అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
సున్నం చెరువు వద్ద ఎలాంటి సర్వే నిర్వహించకుండా, నోటీసులు జారీ చేయకుండా, ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి అక్రమ నిర్మాణాల పేరుతో ఇండ్లు కూల్చుతున్నారని హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
ఈ పిటిషన్‌ను విచారిస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, పిటిషనర్లు సమర్పించిన పత్రాల్లో ఎలాంటి తప్పులు లేవని తేల్చి చెప్పిన హైకోర్టు.
సున్నం చెరువు పునరుద్ధరణకు అనుమతి కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు చేయాలని, అప్పటివరకు సున్నం చెరువు వద్ద ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని హైడ్రాకు అదేశాలు జారీ చేసిన హైకోర్టు…..