రిజిస్ట్రేషన్ పని వేళలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం…..

On: Friday, March 27, 2026 11:16 AM

 

Mar 27, 2026,

తెలంగాణ : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ల పని వేళలను ప్రభుత్వం పెంచింది. ఈ నెల 28, 30, 31 తేదీలలో అన్ని కార్యాలయాలు ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఈ మూడు రోజుల పాటు సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు.

27 Mar 2026

Leave a Comment