సూర్యాపేట: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీర్ అక్బర్ ఇటీవల నూతనంగా ఎన్నికైన సందర్భంగా టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలవడంతో నూతన కమిటీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన తీన్మార్ మల్లన్న, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్పీని బలోపేతం చేసేలా జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరి శంకర్ గౌడ్, జిల్లా నాయకులు ఆవుల అంజయ్య యాదవ్, యాదవ్ బొల్లె సైదులు, తగుళ్ల జనార్ధన్,బూర కిరణ్ గౌడ్,మామిడి ఉదయ్, ఎర్పుల రాజు, బంగారి అనిల్, తదితరులు పాల్గొన్నారు.








