శంషాబాద్ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి శంషాబాద్‌లోనే ల్యాండ్ అయింది. శనివారం ఉదయం 6:49 గంటలకు 98 మంది ప్రయాణికులతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్ 110 విమానం ఫుకెట్‌కు బయలుదేరింది. అయితే, గాల్లోకి ఎగిరిన 8 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఏటీసీ అధికారుల అనుమతి కోరారు. వెంటనే స్పందించిన అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు. ఉదయం 6:57 గంటలకు పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం మధ్యాహ్నం 1:26 గంటలకు విమానం తిరిగి ఫుకెట్‌కు బయలుదేరింది..