MPUPS పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు….

On: Saturday, February 28, 2026 8:46 PM

 

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:

జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గల మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కూలు యొక్క యూనిఫామ్స్ (డ్రెస్,టై,బెల్ట్,షూస్)వంటి వాటిని ఆ గ్రామ ప్రజా ప్రతినిది అయినటువంటి సర్పంచ్ చింత ప్రియాంక మహేష్ చేతుల మీదుగా అందజేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీరియ తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఉన్న విద్యార్థుల సంఖ్య కంటే ఇపుడు చాలా పెరిగిందని ఇదే ఉస్తాహంతో పిల్లల విద్యా పరంగా ఇంకా ముందుకు వెళ్తామని అలాగే పిల్లల తల్లి దండ్రులు కూడా మాకు చాల బాగా సహకరిస్తున్నారని ఇంకా సహకరించాలని ఆయన కోరారు.

గ్రామ సర్పంచ్ చింత ప్రియాంక మహేష్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు పిల్లల తల్లి దండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీరియ, మరియు ఉపాధ్యాయులు సాయన్న,వినోద్, రాధిక, మరియు పాఠశాల సిబ్బంది పిల్లల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు…

28 Feb 2026

Leave a Comment