
A9 న్యూస్ ,సెప్టెంబర్ 03,
ఆర్మూర్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ఈనాడు ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. “శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశ ప్రయాణం” అనే అంశంపై విద్యార్థులు వ్యాసరచనలో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు మొదటి బహుమతి ఆఫ్నా నాజ్ భావన, ఫిర్టోస్ మరియు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నహిదా ఫిర్టోస్ మాట్లాడుతూ, “మన విద్యార్థినులు శాస్త్ర సాంకేతిక రంగాల్లోని అంశాలను ఎంతో లోతుగా అర్థం చేసుకొని అద్భుతంగా తమ ఆలోచనలను వ్యక్తపరిచారు. ఇలాంటి ప్రతిభ గల బాలికల భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది. మీ కృషి మా గర్వకారణం” అని పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ ప్రోత్సాహకరమైన మాటలతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు






