*శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.
ఎ9 న్యూస్ ,తూప్రాన్, జులై, 20.
తూప్రాన్ పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయం వెనుక ఉన్న శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ కార్యాలయంలోపుష్యమి నక్షత్రం రోజున అనగా ఈ నెల 25న శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిన్నారులకు స్వర్ణమృత ప్రశన కార్యక్రమం శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏకలవ్య గ్రామీణ వికాస పౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ వైస్ చైర్మన్ లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0 నుంచి 16 ఏళ్ల లోపు చిన్నారులు స్వర్ణఅమృతం ను ప్రతి నేల పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిన్నారులకు స్వర్ణమృత బిందువులు వేయించాలని సూచించారు. ఈ స్వర్ణామృతం వేయడం వల్ల భవిష్యత్తులో కలిగే ఉపయోగాలు, లాభాలు వివరించారు. స్వర్ణామృత ప్రాశన ఉపయోగాలు 1. పిల్లల్లో రోగ నిరోధక శక్తి, స్మరణ శక్తి, గ్రహణ శక్తి మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 2. మేధాశక్తిని, సమగ్రమైన శరీర కాంతిని, బలాన్ని పెంపొందించుతుంది. శారీరక మానసిక ఎదుగుదలకు సహాయపడుతుంది. 3. గ్రహ బాధలను తొలగించి శుభములనే కలుగజేయును. ఇది ఉపయోగించిన ఆరు మాసాలలోనే మేధావిగా అన్ని పనులలో మెప్పును పొందుదురు. 4. హైపర్ ఆక్టివ్, ఆటీజమ్, నత్తి (మాటలు సరిగా రారపోవడం) మెదడు సరిగా ఎదగక పోవడం వంటి వాటిలో సమర్ధవంతంగా పని చేస్తుందని తెలిపారు. ఇట్టి సువర్ణావకాశం ను ప్రతి ఒక్కరు వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యం తో పాటు జ్ఞాన మేధా సంపత్తిని నీ పెంపొందించుకోవాలని సూచించారు. స్వర్ణామృత ప్రశన అనేది పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేదంలో ఉపయోగించే ఒక చికిత్స. దీనిని స్వర్ణ ప్రశన లేదా సువర్ణప్రశన అని కూడా పిలుస్తారు. ఈ చికిత్సలో, పిల్లలకు బంగారు రేణువులను కలిపిన ద్రావణాన్ని ఇస్తారు. ఇది పిల్లల పెరుగుదలకు, జ్ఞాపకశక్తికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. స్వర్ణామృత ప్రశన అనేది
బంగారం యొక్క ఉపయోగం:
ఆయుర్వేదంలో, బంగారం ఒక ఔషధంగా పరిగణించబడుతుంది మరియు ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది అని నమ్ముతారు.
పిల్లలకు ఉపయోగం:
స్వర్ణామృత ప్రశన 0 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇవ్వవచ్చు.
లాభాలు: స్వర్ణామృత ప్రశన తీసుకోవడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి మెరుగు పడుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది. పుష్య నక్షత్రం:
పుష్య నక్షత్రం రోజున ఈ చికిత్స చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎప్పుడు తీసుకోవాలి: ఉదయం ఖాళీ కడుపుతో స్వర్ణామృత ప్రశన తీసుకోవడం మంచిది.
ఎక్కడ దొరుకుతుంది: స్వర్ణామృత ప్రశన ఆయుర్వేద మందుల షాపులలో లేదా ఆయుర్వేద వైద్యుల దగ్గర లభిస్తుంది.
జుట్టు, చర్మం, పిల్లల అభివృద్ధికి:
స్వర్ణామృత ప్రశన జుట్టు మరియు చర్మం ఆరోగ్యానికి, పిల్లల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.