తూప్రాన్, సెప్టెంబర్, 21:
తూప్రాన్ పట్టణంలో స్వచ్ఛత హీ సేవ 2025 ర్యాలీ శనివారం మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూసుకోవాలని సూచించారు. మున్సిపల్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంఈఓ డాక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






