*సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు అవినీతి పరుడిని మళ్లీ విధుల్లో చేర్చుకోవడం న్యాయమేనా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న….
అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది….
అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రభుత్వ ఉద్యోగులు నిర్దోషిగా నిరూపితమయ్యే వరకూ తిరిగి సర్వీసులోకి అనుమతించరాదని మొన్న జూలై 3 తారీఖున గురువారం ఇచ్చిన ఓ తీర్పులో పేర్కొంది…
ఇలాంటి వారిని మళ్లీ డ్యూటీలోకి చేర్చుకుంటే ప్రజల విశ్వాసం దెబ్బ తింటుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది…
లంచం కేసులో దోషిగా తేలిన రైల్వే ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది..!🇮🇳 సత్యమేవ జయతే.