సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్ కార్యక్రమం – నల్లూరులో పరిశీలన…..

On: Tuesday, September 2, 2025 9:12 PM

 

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్ కార్యక్రమం భాగంగా నిజమాబాద్ జిల్లా కేంద్ర బృందం అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించింది. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యత, పిల్లల బరువు తదితర వివరాలను పరిశీలించి నామోదు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి విగ్నేష్, కారోబార్ గంగాధర్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. గ్రామస్థులలో పోషకాహారంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

02 Sep 2025

Leave a Comment