Aug 08, 2025,

తెలంగాణ : హైదరాబాద్‌లోని కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, SR నగర్, ఫిలింనగర్, బోరబండ, అబిడ్స్, తార్నాక, హిమాయత్ నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. బంజారాహిల్స్ దేవరకొండ బస్తీ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. నగరంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.