
ఇంటెన్షిప్లో భాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఎసెన్షియల్ షాపులలో 5వ రోజు ఇంటెన్షిప్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు,
ఈ ప్రోగ్రాం లో భాగంగా విద్యార్థులు ఎంప్లాయర్ దగ్గర ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు షాపులో జరుగుతున్నటువంటి వివిధ పనులలో పాల్గొంటూ రియల్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నా షాప్ ఓపెన్ అయినప్పటినుండి కస్టమర్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి వారికి కావలసినటువంటి మెటీరియల్స్ ని ఎలా చూయించాలి వారికి సంబంధించినటువంటి సర్వీసెస్ ని ఎలా ఇవ్వాలి అనే విషయాల పైన పూర్తి అవగాహన పొందుతున్నారు ముఖ్యంగా కంప్యూటర్స్ కి వచ్చేటువంటి వైరస్లను అలాగే కంప్యూటర్స్లో ఇన్స్టాల్ చేసేటువంటి సాఫ్ట్వేర్స్ను ఎలా ఈజీగా సర్వీస్ ఇవ్వాలో తెలుసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు,
అలాగే ప్రింటర్లలో యూస్ చేసేటువంటి టోనర్స్ ని ఎలా శుభ్రం చేయాలి వాటిలో మళ్లీ కలర్స్ ని ఎలా ఫీల్ చేయాలి అనే విషయాలను ఈజీగా తెలుసుకుంటున్నారు
వీటితోపాటు సీసీ కెమెరాస్ ని ఎలా ఫిక్స్ చేయాలి వాటి నుండి బ్యాకప్ ని ఎలా తీయాలి తర్వాత సీసీ కెమెరాస్ ని ఎలా సర్వీస్ చేయాలి అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నారు,
తరగతి గదిలో చెప్పే విషయాలను కండ్లకు కట్టినట్టుగా ఈ వర్క్ ఏరియాకి వచ్చి తెలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని ఇలాంటి ఇంటెన్షిప్లవల్ల మాకు రియల్ ఎక్స్పీరియన్స్ చాలా వస్తుందని చాలా ఆనందంగా వివరించారు, ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న మాకు ఇలాంటి ఇంటెన్షిప్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసినందుకు మా ఒకేషనల్ టీచర్ సురేష్ సార్ గారికి , మా ప్రిన్సిపల్ సుధారాణి మేడమ్ గారికి,అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామని విద్యార్థులు అన్నారు,
ఈ ప్రోగ్రాం లో దాదాపు 46 మంది విద్యార్థులు పాల్గొని రియల్ ఎక్స్పీరియన్స్ ని పొందుతున్నట్టుగా తెలిపారు..







