ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు-మెదక్ జిల్లా ఎస్పీ…..

On: Monday, August 25, 2025 10:56 AM

 

ఎ9 న్యూస్ మెదక్ ఆగస్టు 25:

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సంస్థలలో ర్యాగింగ్ చేయడం నేరం, ర్యాగింగ్‌ లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు” అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

1997 నుండి అమల్లో ఉన్న “ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్” ప్రకారం ర్యాగింగ్ ఒక క్రిమినల్ నేరం.విద్యార్థులు తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు, విద్యాసంస్థల నుండి తొలగింపు, భవిష్యత్తులో విద్యా–ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.సీనియర్లు జూనియర్లను వేధించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు.

అలాగే, విద్యాసంస్థల యాజమాన్యం పట్ల కూడా ఎస్‌పీ ఆదేశాలు జారీ చేశారు:

ప్రతి కళాశాలలో యాంటీ–ర్యాగింగ్ కమిటీలు, స్వ్కాడ్‌లు ఏర్పాటు చేయాలి.

కొత్తగా చేరిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి.

అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిరంతరంగా నిర్వహించాలి.

విద్యార్థులు ఎటువంటి వేధింపులు, దౌర్జన్యాలు ఎదుర్కొన్నా కళాశాల యాజమాన్యనికి లేదా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ర్యాగింగ్ అనేది విద్యార్థుల వ్యక్తిగత భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.విద్యార్థుల పిర్యాదు కోసం డయల్ 100 లేదా మెదక్ పోలీస్ కంట్రోల్ రూమ్: +91 87126 57888 గాని పిర్యాదు చేయాలి.ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

14 Mar 2026

Leave a Comment