Jul 23, 2025,
తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక సరైన విధంగా లబ్దిదారులకు చేరేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశిచారు. లబ్దిదారులపై రవాణా భారం అధికంగా పడకుండా వీలైనంత దగ్గరలో ఇసుక అందే విధంగా చూడాలన్నారు. బేస్‌మెంట్ నిర్మాణం కోసం అక్కడక్కడ అందుబాటులో ఉన్న మట్టిని తీసుకెళ్తున్న లబ్దిదారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం సరైన చర్య కాదని చెప్పారు.