కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడి
ఎ9 న్యూస్, మెదక్, జులై 24:
సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పేర్కొన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ యూసఫ్ అలీ ఆధ్వర్యంలో పౌర సమాచార అధికారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు కలెక్టర్
గురువారం కలెక్టరేట్ కార్యాలయ ప్రజావాణి హాలులో జరిగిన సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
29-07-2025న రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు రాష్ట్ర సమాచార కమిషనర్లు, తెలంగాణ సమాచార కమిషన్, హైదరాబాద్ నుండి మెదక్ వరకు పర్యటన కార్యక్రమం. ఉంటుందన్నారు.
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక పిఐఓ ఉంటారని
అతను లేదా ఆమె ప్రజల సమాచార అభ్యర్థనలను స్వీకరించి, వాటికి సమాధానం ఇస్తారని తెలిపారు. సమాచార హక్కు చట్టం
చట్టం గురించి పౌర సమాచార అధికారులు మరింత అవగాహన కలిగి ఉండాలని “దరఖాస్తుదారులకు సమాచారం అందించడం సంబంధిత అధికారుల బాధ్యత” అని ఆయన అన్నారు.నిబంధనలకు లోబడి పౌరులకు సమాచారం అందించడంలో
జవాబు దారీ తనంతో వ్యవహరించాలన్నారు. సదస్సులో, అధికారులు చట్టం యొక్క వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ముఖ్యంగా పౌరుల నుండి అభ్యర్థనలను స్వీకరించడం, సమాచారాన్ని అందించడం, మరియు అప్పీళ్లను నిర్వహించడం వంటి,విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.
జిల్లాలో ఆర్టిఐ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసుకోవాలి. సమాచార అభ్యర్థనలను సకాలంలో అందించడానికి, ప్రజలకు అవసరమైన సమాచారం సులభంగా అందించడానికి
ఈ చట్టం ఉపయోగ పడుతుందన్నారు.జిల్లాలో ఆర్టిఐ పెండింగ్ దరఖాస్తులపై
వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ యూసఫ్ అలీ, ఆర్డీవోలు నర్సాపూర్ మహిపాల్ రెడ్డి తూఫ్రాన్ జై చంద్రారెడ్డి, మెదక్ రమాదేవి
పౌర సమాచార అధికారులు, పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.