Mar 20, 2026:
తెలంగాణ : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఈ బడ్జెట్ సుమారు ₹3.36 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సుమారు ₹29 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.








