A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నవనాథ సిద్దుల గుట్టపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రాములవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగగా, భక్తులు భారీ సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా సాగింది. కార్యక్రమం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రాంతీయ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, వందలాది మంది భక్తులకు ప్రసాదంగా భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులను భక్తులు అభినందించారు.








