ఆలూర్ మండలంలో మిర్దపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో సుమారు 20వేల విలువగల క్రీడా దుస్తులను దాతలు అశోక్, suresh ,మోహన్ ,మైపాల్, నర్సిరెడ్డి అందజేశారు. అదేవిధంగా పదివేల విలువచేసే క్రీడా దుస్తులను గ్రామ అభివృద్ధి కమిటీ అందజేశారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంట శ్రీనివాస్ రెడ్డి, పి డి సుజాత, ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు.







