*సాయిబాబ కు వెండి కిరీటం సమర్పణ.
*గురుపౌర్ణమి సందర్భంగా డాక్టర్ ఎ.వి.స్వామి ప్రత్యేక పూజలు, అన్నదానం.
ఎ9 న్యూస్ తూప్రాన్ మెదక్ జులై, 10.:
మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో తూప్రాన్ శ్రీ షిర్డీ సాయిబాబ ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా డాక్టర్ ఎ.వి.స్వామి ప్రత్యేక పూజలు, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వెండి కిరీటం తొడిగి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎ.వి.స్వామి మాట్లాడుతూ గురు పరంపర లో భాగంగా షిర్డీ సాయి నీ కొలిచి తరిస్తారని తెలిపారు. అంతే కాకుండా దత్తాత్రేయ, సాయిబాబ, వ్యాసమహర్షి లాంటి గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని పిలుస్తారని తెలిపారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారని తెలిపారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారని తెలిపారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారన్నారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహాముని పుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉందన్నారు. తూప్రాన్ శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ,పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో వందలాది మంది భక్తులు హాజరై ,సాయిబాబ కృపకు పాత్రులైతారని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎ.వి.స్వామి కుటుంబ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్. గజ్జెల్లి రాములు, చండీ శ్రీనివాస్, సైనతు హుసేన్ తోపాటు భక్తులు పాల్గొన్నారు.