గగుపల్లి గ్రామంలో తాగునీరు–పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్…

On: Thursday, February 19, 2026 6:08 PM

 

ఆలూర్ మండలం గగుపల్లి గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ కొండి నాడ్పి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలోని తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచడం, పైపులైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయడం, నీటి సరఫరా సమయాలను క్రమబద్ధీకరించడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. నీటిలో నాణ్యత పరీక్షలు నిర్వహించి, ప్రజలకు ఆరోగ్యకరమైన నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.పారిశుద్ధ్య అంశంలో భాగంగా ప్రైవేట్ సిబ్బందితో గ్రామంలో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరిచే పనులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ఎక్కడా చెత్త పేరుకుపోకుండా, దోమల పెరుగుదలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య సిబ్బందితో సమన్వయం చేసుకుని డ్రైనేజీల శుభ్రత, చెత్త తొలగింపు, దోమల నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి నీటి కొరత లేకుండా మోటార్లు, బోర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పరిశీలిస్తున్నామని అన్నారు. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గగుపల్లి గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిరంతరం కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండి నాడ్పి గంగధర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ కిషోర్ ,వార్డు మెంబెర్స్ మదరి శంకర్, ఆకాష్ శెట్టి, తెడ్డు సాయమ్మ, మదరి రాణి గ్రామ పంచాయతీ సిబ్బంది గంగాధర్, ప్రకాష్,నారాయణ, విజయ, గ్రామ యువకులు సతీష్ సుధీర్ పాల్గొన్నారు.

19 Feb 2026

Leave a Comment