మెదక్ టౌన్ పరిధిలో భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ….

On: Friday, September 5, 2025 8:25 AM

 

ఎ9 న్యూస్, మెదక్, సెప్టెంబర్ 5:

వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా మెదక్ టౌన్ పరిధిలో చేపట్టిన భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఈ రోజు స్వయంగా పరిశీలించారు.

ఎస్పీ పెద్ద బజార్, జిలాని గడ్డ, కొల్లిగడ్డ తదితర ముఖ్య ప్రాంతాలు సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్త్, ట్రాఫిక్ నియంత్రణ, పీకేట్లు మరియు సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలను సమీక్షించారు. ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ మార్గదర్శకాలు జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిమజ్జనోత్సవాల్లో భారీగా ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

అలాగే, ప్రజలు పోలీస్ విభాగానికి సహకరించి నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలు గౌరవిస్తూ పాల్గొంటే ఉత్సవాలు విజయవంతంగా సాగుతాయని తెలిపారు.

14 Mar 2026

Leave a Comment