ఆరు నెలలు సెలవులో స్మితా సబర్వాల్..

On: Friday, August 29, 2025 12:26 PM

* హైదరాబాద్:ఆగస్టు 29*

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్ కాత్యా యనీ దేవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు స్మిత సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో ట్విట్ షేర్ చేశారు.కొన్ని రోజులు గా చాలా నొప్పితో కూడిన అనారోగ్యంతో బాధపడు తున్నానని, ఆమె చెప్పుకొ చ్చారు. ఈ కారణంగానే స్మితా సబర్వాల్ ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం లీవ్‌ను మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో సీఎంఓ అడిషనల్ సెక్రటరీగా పని చేసిన స్మితా సబర్వాల్.. కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాల్లో ముఖ్యపాత్ర పోషించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్మితా సబర్వాల్‌ పై కూడా చర్యలకు సిఫార్సు చేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యం లో ఆమె సెలవు తీసుకోవ డంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

15 Mar 2026

Leave a Comment