సిక్స్‌ కొట్టి అక్కడే కుప్పకూలిన ఆటగాడు.. దగ్గరకు వెళ్లి చూడగా..

On: Monday, June 30, 2025 11:14 AM

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. వయస్సుతో తేడా లేకుండా ఈ మహ్మమారికి బలవుతున్నారు చాలా మంది. తాజాగా శుక్రవారం జూన్ 27న సినీ నటి షెఫాలీ జారీవాలా (42) కూడా గుండెపోటు కారణంగా మరణించారు. ఆమె మరణంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈమె మరణం నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే.. ఇలాంటి మరో ఘటన వెలుగు చూసింది. తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

వివరాళ్లోకి వెళితే.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకి చెందిన హర్‌జిత్‌ సింగ్‌ అనే యువకుడు ఫ్రెండ్స్‌తో కలిసి గురుహర్ సహాయ్ డీఏవీ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అయితే మ్యాచ్‌లో భాగంగా హర్‌జిత్‌ సింగ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో బౌలర్ వేసిన ఓ బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే సిక్స్ కొట్టిన వెంటనే అతను పిచ్‌ నుంచి కొంచెం ముందుకు వెళ్లి బ్యాట్‌ను కింద పెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. కాసేపు ఆలాగే కూర్చున్న తర్వాత అక్కడే పిచ్‌పై పడిపోయాడు. ఆది గమనించిన నాన్-స్ట్రైకర్‌గా ఉన్న మరో ఆటగాడు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వచ్చి ఎమైందని అడిగగా హర్‌జిత్‌ సింగ్‌ స్పందించలేదు.

https://twitter.com/i/status/1939225701938536616

దీంతో గ్రౌండ్‌లో ఉన్న ఆటగాళ్లందరూ ఒక్కసారిగా బ్యాటర్ వద్ద పరిగెత్తుకుంటూ వచ్చారు. అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. కానీ హర్‌జిత్‌ స్పందించకపోవడంతో.. కొంతమంది అతని చేతులకు, మరికొందరు కాళ్లను భాగా రఫ్‌ చేశారు. అయినా హర్‌జిత్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ హర్‌జిత్‌ను పరిశీలించిన వైద్యులు అతని గుండెపోటు కారణంగా అప్పటికే మరణించినట్టు తెలిపారు. అయితే హర్‌జిత్‌ 49 పరుగులు చేసిన తర్వాత ఇలా గుండెపోటుతో పడిపోయినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

21 Jul 2025

Leave a Comment