ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు శనివారం రెండో నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో ఆయనకు అనుకూలమైన సమయంలో సిట్ విచారణకు హాజరుకావాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. విచారణకు వచ్చే తేదీ, సమయాన్ని దర్యాప్తు అధికారికి ముందు తెలియజేయాలని నోటీసులో సూచించారు. ఈ నెల 14న జారీ చేసిన నోటీసులో రెండు రోజుల్లో విచారణకు రావాలని సిట్ అధికారులు ప్రవీణ్ కుమార్‌ను కోరారు. అయితే సిట్ నోటీసు విషయాన్ని ఆయ న తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా అందరికి తెలిపినప్పటికీ విచారణకు మాత్రం హాజరుకాలేదు. ఈ క్రమంలో ఆయనకు రెండో నోటీసు జారీ అయింది..