మాజీమంత్రి కేటీఆర్ కి సిట్ నోటీసులు…

On: Thursday, January 22, 2026 7:06 PM

 

రేపు విచారణకు రావాలన్న అధికారులు…

హైదరాబాద్:జనవరి 22

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేతకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి సిట్ ఈ నెల 20న హరీశ్ రావును పిలిపించి విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీశ్ రావు ను సిట్ విచారించింది. అవసరం అయితే మళ్లీ పిలుస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు.

ఇప్పుడు తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది సిట్. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్లలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి సిట్ అధికారు లు నోటీసులు అంటించా రు. రేపు ఉదయం 11 గంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది.

కేటీఆర్ కి సిట్ నోటీసులు నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ భవన్ కి రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకి కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ నోటీసులపై కేటీఆర్, లేదా టిఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపటి విచారణలో కేటీఆర్ వెల్లడించే అంశాలు ఈ కేసులో మరిన్ని కీలక మలుపులకు దారి తీసే అవకాశం ఉంది.

04 Feb 2026

Leave a Comment