చేగుంట, ఆగస్టు 9 (ఎ9 న్యూస్):
రాఖీ పౌర్ణమి సందర్భంగా, మెదక్ జిల్లా మాజీ ఎంపీపీల ఫోరం ఉపాధ్యక్షులు, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ గారికి చెల్లెలు రాఖీ కట్టి సోదరునిపై తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గారు, “ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున చెల్లెలు చేత రాఖీ కట్టించుకోవడం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది,” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, “ప్రతి ఒక్క చెల్లెలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, వారి జీవితాలు ఆనందాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలోని అన్ని ఆడబిడ్డలు ఆర్థికంగా, సామాజికంగా బలపడాలని నా మనస్ఫూర్తి ప్రార్థన,” అని తెలిపారు.
“ప్రజాసేవ పట్ల నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. ఆయురారోగ్యాలతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరం,” అని చెప్పారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.