సిరికొండ నూతన ఎస్సైగా బాధ్యతలు :

On: Sunday, July 6, 2025 7:25 PM

 

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

సిరికొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్‌ లో నూతన ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్ సిబ్బందితో సమావేశమై విధుల నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చారు. అనంతరం ఎస్సై మీడియాతో మాట్లాడుతూ – “శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు. మహిళల భద్రత, యువతలో నేరభావాల నివారణకు చర్యలు తీసుకుంటాను. ప్రజలతో స్నేహపూర్వకంగా,న్యాయపూర్వకంగా ముందుకెళ్తాను” అని వెల్లడించారు. ప్రజలు కూడా పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

23 Jul 2025

Leave a Comment