సంగారెడ్డి జిల్లా – పటాన్చెరు నియోజకవర్గ
సంగారెడ్డి, ఆగస్టు 30
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం పంచామృతాభిషేకం అనంతరం శ్రీ సిద్ధి గణపతికి కృష్ణ వర్ణంలో ప్రత్యేక అలంకరణ చేశారు.
ప్రతిరోజు మహా యాగహోమం విశేష పూజలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు అనంతరం నిత్య అన్నదానాన్ని నిర్వహించారు .అధిక సంఖ్యలో భక్తులు హాజరై గణపతి స్వామి ఆశీస్సులు పొందారు.
నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు పల్లకీ సేవ భజన–సంకీర్తనలు ,సాంస్కృతిక–సాంప్రదాయ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.అని ఆలయ ఈవో లావణ్య కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







