లో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ….

On: Friday, February 27, 2026 9:11 PM

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని సూరారం గ్రామంలో ఉన్న జెడ్పి పాఠశాల సూరారం లో శుక్రవారం స్వయం పాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించి తరగతి గదుల్లో బోధన నిర్వహించారు. చిన్నారులు గురువులుగా మారి పాఠాలు చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి గారు విద్యార్థులను అభినందిస్తూ, స్వయం పాలన దినోత్సవం ద్వారా నాయకత్వ లక్షణాలు, బాధ్యతా భావం పెంపొందుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

28 Feb 2026

Leave a Comment