ధర్పల్లి మండలంలో కత్తెర పోట్ల కలకలం – నలుగురికి గాయాలు….

On: Tuesday, September 2, 2025 6:59 PM

 

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కత్తెర పోట్ల సంఘటన కలకలం రేపింది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు అర్ధరాత్రి సమయంలో ఊహించని రీతిలో దాడి చేశాడు.

మొదటగా కాలనీలోని మచ్చ లక్ష్మీపై దాడి చేయగా, ఆమె కూతురు గౌతమి అడ్డుకోవడానికి వచ్చినపుడు ఆమెను కూడా కత్తెరతో పొడిచాడు. హడావుడి గమనించిన పక్కింటి శెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభ సహాయం చేసేందుకు రాగానే వారిపై కూడా దాడి కొనసాగించాడు. తరువాత అదే కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న శెట్పల్లి భోజేశ్వర్ దగ్గరకు వెళ్లి అతన్ని కూడా కత్తెరతో పొడవడం జరిగింది.

ఈ దాడిలో గాయపడ్డ నలుగురిని తక్షణమే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారంతా ప్రమాదానికి గురికాకుండా ప్రాణాపాయం లేని స్థితిలో ఉన్నారని తెలిపారు.

సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కత్తెరతో దాడికి వెనుక ఉన్న కారణాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.

02 Sep 2025

Leave a Comment