సప్త హారతి గిరి ప్రదక్షిణ ఆహ్వాన పత్రిక….

On: Thursday, November 13, 2025 3:32 PM

 

A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్ :

ఆర్మూర్ మండల పరిధిలోని శ్రీ నవనాథ సిద్దేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించనున్న సప్త హారతి గిరి ప్రదక్షిణ ఉత్సవాల నేపథ్యంలో ఆహ్వాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.

ఈ సందర్భంగా దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ — “సప్త హారతి గిరి ప్రదక్షిణ ప్రాంతీయ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక. ఈ పుణ్య కార్యక్రమం ప్రజల ఏకతా, భక్తి భావాలకు ప్రతిబింబం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి బాబా గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు జిమ్మి రవి, భారత్ గ్యాస్ సుమన్, రామ గౌడ్, చరణ్ రెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్, సతీష్, బట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

03 Mar 2026

Leave a Comment