శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు….

On: Friday, January 9, 2026 8:06 PM

 

జిల్లా కేంద్రం స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్ కామారెడ్డి లో ఈరోజు 9 /1/ 2026 శుక్రవారం రోజున ముందస్తుగా ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ నాగభూషణం గారు మాట్లాడుతూ హిందూ సంస్కృతికి, ప్రకృతి పంటలకు ఆధ్యాత్మికతకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుందని తెలిపారు. చెడుపై, మంచి విజయమని తెలిపారు. భోగిమంటలు చీకటి అజ్ఞానాన్ని వదిలి, వెలుగు జ్ఞానం వైపు ప్రయాణించాలని తెలియజేస్తుందని తెలిపారు. సంక్రాంతి పండగ ఆనందాన్ని, ఐకమత్యాన్ని, కొత్త ఆశలను నింపుతుందని తెలిపారు. విద్యార్థులు గాలిపటాలను ఎగురవేసేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపారు చైనా మాంజాను వాడవద్దని తెలిపారు. విద్యార్థుల హరిదాసు వేషధారణ, బొమ్మరిల్లు కొలువు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు గాలిపటాలను ఎంతో సంతోషంగా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ప్రిన్సిపల్ శ్రీ నాగేష్ గారు. ఆచార్య బృందం విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.

04 Feb 2026

Leave a Comment