రాజన్న జిల్లా: నవంబర్ 10
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, మానవత్వం చాటుకున్నారు. కమ్యూని టీ పోలీసింగ్‌లో భాగంగా మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఆమె వినూత్న కార్యక్రమం చేపట్టారు.
వివిధ సన్మానాలు, సత్కారాల సందర్భంగా ఆమెకు అందిన శాలువాల తో చిన్నారుల కోసం గౌన్లు కుట్టించి పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలోని బేడ, బుడగ, జంగాల కాలనీల చిన్నారులకు తాజాగా టౌన్ సీఐ వీరప్రసాద్తో కలిసి ఈ గౌన్లను ఆమె స్వయంగా అందజేశారు. ఈ సందర్భం గా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ….
తనకు అందిన గౌరవాన్ని సమాజానికి తిరిగి అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని, చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటం ఎంతో ఆనందం గా ఉందని తెలిపారు. సన్మానాల సందర్భంగా ఇచ్చే శాలువాలు, కండువాలు వృథా కాకుండా గౌన్లు కుట్టించి చిన్నారులకు అందజేసి నట్లు పేర్కొన్నారు. స్థానికులు ఏఎస్పీ చర్యను ప్రశంసిస్తూ, ఇతరులు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రేరణ పొందాలని అభిప్రాయపడ్డా రు.
ఇందుకు సంబంధించిన న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. శాలువాలు గౌరవంగా తీసుకోని ప్రేమగా చిన్నారులకు ఇచ్చిందని నెట్టింట ప్రశంసలు కురిపిం చారు. సాధారణంగా అధికారులకు సన్మాన కార్యక్రమాల్లో శాలువాలు అందిస్తారు. ఆ శాలువా లను భద్రపరుచుకోవడం బదులు వాటిని ఉపయో గకరంగా మార్చాలన్న ఆలోచన శేషాద్రిని రెడ్డికి వచ్చింది. అందుకే ఇప్పటివరకు తనకు వచ్చిన సన్మాన శాలువాలతో చిన్నారుల కోసం అందమైన గౌన్లు కుట్టించి వారికి అందించారు.
ఆ గౌన్లు వేసుకున్న పిల్లల ముఖాల్లో మెరిసిన చిరునవ్వులు చూసిన ఆమె కళ్లలో సంతోషం కనిపించింది. తనకు గౌర వంతో ఇచ్చిన శాలువాలు ఇప్పుడు ఈ చిన్నారుల చిరునవ్వులుగా మారాయి. ఇది తన కెరీర్లో గుర్తుండిపోయే క్షణం అని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు.
ఆమె ఈ కార్యక్రమాన్ని కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా చేపట్టడం విశేషం. ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంచే ఈ చర్యకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బుడగ జంగాల కాలనీ గతంలో వరదలతో తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్న ప్రాంతం. ఆ సమయంలో కూడా శేషాద్రిని రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.






