హైదరాబాద్:మార్చి 23:
ప్రజా పాలనలో ఎన్ని సమ స్యలు ఎదురైనా రైతుల సంక్షేమాన్ని ఆపడం లేదని రేవంత్ చెప్పారు. ఆదివారం దాదాపు 3600 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గత కేసీఆర్ పాలనలో రైతుల కోసం నెలకు రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం రైతుల కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదనే నానుడిని తాను నమ్ముతానన్నారు.
రేవంత్ రెడ్డి. రైతు భరోసా మొత్తాన్ని పెంచామని గుర్తు చేశారు. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్ల వర కు ఖర్చు చేశామన్నారు. రైతును రాజును చేయా లని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.గత పాలకులు విపక్ష నేతల నియోజక వర్గాల పట్ల వివక్ష చూపిం చారు. నేను నేతలతో వ్యతిరేకిస్తాను. కానీ, ప్రజల పట్ల వివక్ష చూపించను. సిద్ధిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను. వివక్ష చూపే వ్యక్తినే అయితే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కొడంగల్ కు తీసుకెళ్లే వాడినిఅని అన్నారు.
ప్రజలు బీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారం ఇచ్చారు, మాకు కూడా రెండుసార్లు ఇస్తారు. రాబో యే రోజుల్లో యూరిత కొరత వచ్చేలా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల మనకు యూరియా సమస్య రావొచ్చు. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా బీజేపీ ఎంపీలు చూడాలి. ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపే నేతను కాను నేను. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట లోనూ కాంగ్రెస్ గెలవాలి. సిద్ధిపేట నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తా అని రేవంత్ అన్నారు.
*3 విడతల్లో 9వేల కోట్లు జమ..
మరోవైపు నర్మెట్టలో రైతు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్.. రైతు భరోసా స్కీమ్ నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 3వేల 600 కోట్లు బటన్ నొక్కి రిలీజ్ చేశారు. 70 లక్షల మంది రైతులకు లబ్ది కలగనుంది. రైతు భరోసా డబ్బులు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. నిన్న ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో నిధులు ఈరోజు జమ కానున్నా యి. మిగతా నిధులు రెండు విడతల్లో విడుదల చేయనుంది ప్రభుత్వం. మొత్తంగా 3 విడతల్లో 45 రోజుల వ్యవధిలో 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.








