హైదరాబాద్, ఆగస్టు 9:
పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకొని ఆర్టీసీ (RTC) టికెట్ ఛార్జీలను అనూహ్యంగా పెంచడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “చికెన్ రేట్ల లాగే, RTC ఛార్జీలు కూడా ఎప్పుడెప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి,” అంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కొన్ని రూట్లపై పెరిగిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:
జేబీఎస్ (హైదరాబాద్) – కరీంనగర్: ₹16
నాగర్ కర్నూల్ – హైదరాబాద్: ₹100
నాగర్ కర్నూల్ – కొల్లాపూర్: ₹30
కల్వకుర్తి – హైదరాబాద్: ₹50
ప్రజలు అంటున్నారు – “రేట్లు ఏ ఆధారంగా పెంచారో స్పష్టత లేదు. ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచి పండుగ రోజుల్లో ప్రజలపై భారం పెడుతున్నారు.”
ఈ ఒక్కసారి కాదు, ప్రతి పండుగ సీజన్‌లో ఇదే పరిస్థితి తలెత్తుతుందని, ఇది తక్షణం ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు వెనక వ్యూహమేమిటన్న దానిపై ఇప్పటికీ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.