A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
ఆర్మూర్, 2019 జూలై 16న జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులపై పోలీసులు పెట్టిన కేసును బుధవారం జిల్లా కోర్టు రెండవ సెషన్స్ జడ్జి నేడు కొట్టివేశారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసులో పోలీసులు నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు అధిక ఉత్సాహంతో సిపిఎం నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసినట్లు కోర్టులో న్యాయవాది ఆశ నారాయణ వాదించారు.
కేసులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు, కార్యదర్శివర్గ సభ్యురాలు నూర్జహాన్, కార్యకర్తలు కటారి రాములు, నాయక్ వాడి శ్రీనివాస్, పద్మలతో పాటు అప్పట్లో పార్టీలో ఉన్న గోవర్ధన్ మరియు కృష్ణలపై మధు చేయడం జరిగింది.
నేటి తీర్పుతో ఈ కేసును కోర్టు కొట్టివేయడం పట్ల స్పందించిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు మాట్లాడుతూ, “ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే మాకు నేరంగా ముద్ర వేయబడింది. నాటి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నించినా, అలాంటి అక్రమ కేసులు ఉద్యమాలను ఆపలేవు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడికి ఉన్న హక్కు,” అని తెలిపారు.
ఈ కేసును సమర్థంగా వాదించిన న్యాయవాది ఆశ నారాయణకు, అలాగే న్యాయన్యాయం చేసిన జిల్లా జడ్జికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.