ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే యజమానుల సంయమనం…. 

On: Wednesday, September 3, 2025 8:59 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పట్టణంలో శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణం కోసం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే యజమానులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ తమ తమ డీజేలు వినిపించకూడదని స్వచ్ఛందంగా అంగీకరించి, ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పోలీసులకు అందజేశారు.

తాము ఇచ్చిన హామీని ఉల్లంఘించి డీజేలు వినిపించినట్లయితే, క్రిమినల్ చర్యలకు లోనవుతామని కూడా స్పష్టంగా లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.

15 Mar 2026

Leave a Comment