చందాపూర్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

On: Monday, January 26, 2026 1:10 PM

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం చందాపూర్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్న గౌనల కృష్ణ గౌడ్ గారు గణతంత్ర దినోత్సవ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో సర్పంచ్ గారు విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

04 Feb 2026

Leave a Comment