హైదరాబాద్:సెప్టెంబర్ 24
గ్రూప్1మెయిన్స్ పరీక్షల ర్యాంక్ ల విషయంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించిం ది,దీంతో గ్రూపు1ర్యాంకర్లకు టీజీపీఎస్పీ కి భారీ ఊరట లభించింది, ఈ నిర్ణయంతో గ్రూపు1నియామకాలకు లైన్ క్లియర్ అయింది,
గ్రూప్-1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హైకోర్టు డివిజన్ బెచ్ విచారణ జరిపింది.
2011లో గ్రూప్-1 నిర్వహించారు. ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీం కోర్టు రద్దు చేసింది. 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామ కాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రక్రియను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారిపట్ల పక్షపాతం చూపించారన డానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రూప్-1 పోస్టులు భర్తీ కాలేదా..? 2014 నుంచి అసలు గ్రూప్-1 రిక్రూట్మెంట్ జరగలేదా..? అని హైకోర్టు ప్రశ్నించింది. అసలు 2014 నుంచి టీజీపీఎస్సీ ఉనిలో ఉందా..? అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ ప్రశ్నించారు.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరటనిస్తూ నియామకాలు జరుపుకో వచ్చునని.. అయితే, ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు సీజే జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట లభించింది.