పాస్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రమేష్ జాన్….

On: Monday, September 15, 2025 6:42 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు మామిడిపల్లి పాస్టర్స్ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో బ్రదర్ రమేష్ జాన్ ను సభ్యులు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ దినకరన్ రాజ్ పాల్, కోశాధికారిగా పాస్టర్ మధు ఎంపికయ్యారు.

ఎన్నికల నిర్వహణ బాధ్యతలు సునీల్, ప్రభుదాస్, దైవ చిత్తం, ఇమ్మానుయేల్ లు విజయవంతంగా చేపట్టారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ జాన్ మాట్లాడుతూ – “రానున్న రోజుల్లో క్రైస్తవ సార్వత్రిక సంఘ క్షేమం కోసం కృషి చేస్తాను. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అన్నారు.

కార్యక్రమంలో ఆర్మూర్ మండలంలోని అనేక సంఘ కాపరులు, నాయకులు పాల్గొని కొత్తగా ఎన్నికైన కమిటీకి అభినందనలు తెలిపారు.

13 Mar 2026

Leave a Comment