రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఘన వేడుకలు :

On: Saturday, August 9, 2025 4:57 PM

 

హైదరాబాద్, ఆగస్టు 9:

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి జూబ్లీ హిల్స్ నివాసం కోలాహలంగా మారింది. మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంఘసభ్యులు పెద్దఎత్తున హాజరై, సీఎం గారికి రాఖీలు కట్టి తమ సోదరీ ప్రేమను తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) గారు ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి డా. గీతా రెడ్డి గారు కూడా సీఎం గారికి రాఖీ కట్టి ఆశీర్వాదాలు పలికారు.

ఈ వేడుకల్లో బ్రహ్మకుమారీస్ సోదరీమణులు, ముఖ్యమంత్రి గారిని కలిసి రాఖీ కట్టి శాంతి, సౌభ్రాతృత్వ సందేశాన్ని ఇచ్చారు. అంతేగాక, మలక్‌పేట్ ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల నుండి వచ్చిన విద్యార్థినులు సీఎం గారిని ప్రేమగా రాఖీ కట్టి సంతోషాన్ని పంచుకున్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద గారు

వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుజాత గారు.

బీసీ, విద్యా, శిశు సంక్షేమ, రైతు కమిషన్ల మహిళా ప్రతినిధులు.

కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు గారు.

ఈ రాఖీ పండుగ వేడుక సీఎం నివాసంలో కుటుంబ సమభ్రమంగా, సోదర – సోదరీ భావంతో జరగడం.

 

09 Aug 2025

Leave a Comment