ఆర్మూర్, ఆగస్టు 15: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బస్టాండ్లలో విజిలెన్స్ కానిస్టేబుల్స్‌గా కర్తవ్యనిష్ఠతో విధులు నిర్వహిస్తున్న ఆర్మూర్ డిపోకు చెందిన ఎన్. రాజశేఖర్, మనోహర్‌లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ విజిలెన్స్ కానిస్టేబుల్ అవార్డులు అందజేశారు.
గత కొన్ని నెలలు గా బస్టాండ్లలో దొంగతనాలు, మిస్సింగ్ కేసులు, మొబైల్ ఫోన్లు, పర్సుల చోరీలను అరికట్టడంలో వీరు విశేష పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డిపో మేనేజర్ రవికుమార్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు







