కోటార్మూర్ 6వ వార్డులో బిజెపి ఇంటింటి ప్రచారం జోరు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ 6వ వార్డులో బిజెపి అభ్యర్థులు పుట్టి రాధ–మురళి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకుని, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహిళలు అభ్యర్థులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. స్థానిక సమస్యలను పరిష్కరించి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పుట్టి రాధ–మురళి హామీ ఇచ్చారు. కమలం గుర్తుకు ఓటు వేసి వార్డు అభివృద్ధికి సహకరించాలని వారు ఓటర్లను కోరారు.








