Jul 30, 2025,
ఆందోలులో ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆగస్టు 1వ తేదీన జరుగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డిలో ముఖ్య నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజలను భారీగా సమీకరించాలని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.